GRAND QUIZ 2014

22/01/2014 15:31

       జనవరి 22వ తేది ఎండాడ పాఠశాల  విద్యార్దులమైన మాకు మరపురాని, ఉత్సాహమైన రోజు. 5నుండి 8 తరగతులవారందరమూ ఉత్కంఠతో ఎదురు చూసిన సమయం. ఉదయం గం11.00లకు ప్రారంభమయినది  'ఎండాడ పాఠశాల గ్రాండ్ క్విజ్'.    పెందుర్తి యమ్ ఇఒ శ్రి దేవరాయలు గారు  అధ్యక్షతన, రాష్ట్ర వయోజన విద్య  వనరుల కేంద్రం డైరక్టరు శ్రి బి. మదుసూదనరావు గారు ముఖ్య అతిదిగా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రిమతి లక్శ్మి ఈశ్వరీ గారు గౌరవ అతిధిగా క్విజ్ నిర్వహించడమైనది. 

        5 నుండి 8వ తరగతి వరకు తరగతికి 20మంది చొప్పున 4 గ్రూపుల మద్య పోటీ హోరాహోరీగా జరిగింది. ఎంపిక చేసిన్ 500ప్రశ్నల నుండి లాటరీ ద్వారాతీసిన్ 200 ప్రశ్నలకు 4గ్రూపులూ ఎవరికివారు తీసిపోకుండా జవాబులు చెప్పి గెలుపెవరిదని ఉత్కంఠ రేపారు. చివరకు 6వతరగతి వారు ఒక్క పాయింటు తేడాతో 5వ తరగతిపై నెగ్గారు.

ట్రోపీ తో విజేతలైన 6వ తరగతి విద్యార్దులు, ట్రోపీ  అందజేస్తూన్న రాష్ట్ర వయోజన విద్య  వనరుల కేంద్రం డైరక్టరు శ్రి బి. మదుసూదనరావు గారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రిమతి లక్శ్మి ఈశ్వరీ గారు, ఉపాద్యాయులు.

https://yendadaschool.weebly.com