GANDHI MARGAM

30/01/2016 14:08
      మహాత్మా గాంధీ వర్ధంతి ని గాంధీ మార్గం పేరున ఎండాడ పాఠశాలలో నేడు నిర్వహించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ సర్వ శిక్ష అభియాన్ విశాఖ జిల్లా ప్రాజెక్ట్ అధికారి శ్రీ టి శివరామ ప్రసాద్ గారు ముఖ్య అతిధిగా హాజరై గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి శ్రధాంజలి ఘటించారు. విద్యార్ధులు గాంధీ సూక్తులను ప్లకార్డులుగా ప్రదర్శిస్తూ నేటి సమాజానికి సహనం సౌభ్రాతృత్వం అలవడాలంటే గాంధీ మార్గమే శరణ్యమని ప్రకటించారు. రఘుపతి రాఘవ రాజారామ్ అంటూ బాపును కీర్తిస్తూ పిల్లలు గీతాలు ఆలపించారు.  ప్రాజెక్ట్ అధికారి శ్రీ టి శివరామ ప్రసాద్ గారు మాట్లాడుతూ మహాత్ముడు మన మధ్య లేకపోయినా ఆయన అందించిన స్ఫూర్తి మనతోనే ఉందన్నారు. విధ్యార్ది దశ నుండే మహాత్ముల ఆదర్శాలను స్వీకరించి మంచి భవిష్యతు కు బాటలు వేయాలన్నారు. ఉపాధ్యాలు విద్యార్థులు అందరు మహాత్ముని స్ముత్ర్యర్ధ్యం 2నుముశాలు మౌనం పాటించారు.

     విద్యార్ధులు భాగ్య, కౌసల్య, సాయి దుర్గ, భవాని, సాయి, తదితరులు గాంధీ మార్గం గురించి ఆయన జీవిత సన్నివేశాలతో వివరించారు.ప్రధానోపాధ్యాయులు శ్రీ గొట్టేటి రవి, ఉపాధ్యాయులు యం. ఆదినారయణ, పి. రమాదేవి,  వి. మణి కుమార్, ఎ. విజయలక్ష్మి, వి.వి. దేముడు, ఎస్.తిరుమలరావు, పి. రాధ రాణి, బి. భవాని, జి. సంధ్య, కె.చంద్ర శేఖర్లు పాల్గొన్నారు.     Headmaster Gotteti Ravi organised a programme GANDHI MARGAM ON 30-01-2016 in our school.

https://yendadaschool.weebly.com